జామ్‌నగర్ : కరోనా వైరస్ కాటుకు 14 నెలల చిన్నారి బలైంది. గుజరాత్‌లోని జామ్‌నగర్ చెందిన 14 నెలల చిన్నారి కరోనాతో మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ చిన్నారిని ఏప్రిల్ 5న ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి మంగళవారం సాయంత్రం 4 గంటలకు చిన్నారి కన్నుమూసింది. చిన్నారి తల్లిండ్రులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్ అని తేలిందని వైద్యులు పేర్కొన్నారు. కాగా, గుజరాత్‌లో కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు 13 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 5351 మంది కరోనా బారిన పడగా, 160 మంది మృత్యువాత పడ్డారు.
కరోనాతో 14 నెలల చిన్నారి మృతి